ఎమ్మెల్సీ కవితకు బండ్ల గణేష్ కౌంటర్..

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పేరును ప్రస్తావిస్తూ.. బండి సంజయ్.. ఆయనకు మించిన కమెడియన్ అయ్యారని కేసీఆర్ తనయురాలు.. ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దీనిపై తాజాగా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముషీరాబాద్ నియోజవర్గం గాంధీ నగర్ డివిజన్ లో.. ఎమ్మెల్సీ కవిత ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గత ముందస్తు ఎన్నికల్లో కామెడీ చేసేందుకు బండ్ల గణేష్ అనే వ్యక్తి ప్రజలందరినీ కడుపుబ్బా నవ్వించాడన్నారు. అంతటితో ఆగక ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి బండ్ల గణేష్‌ని మించిన కమెడియన్ అయ్యాడన్నారు.

తాజాగా కవిత వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. కవితకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తానేమీ కమెడియన్ కానని.. తానొక ఫైటర్ అని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా కవితను ఉద్దేశించి తెలిపారు. తాను రాజకీయాల్లో తలదూర్చాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ‘‘కవిత గారూ.. నేనేమీ జోకర్‌ని కాను... నేనొక ఫైటర్‌ని. ప్రస్తుతం నేను రాజకీయాల్లో తలదూర్చాలనుకోవడం లేదు. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టుల మాటలు పట్టించుకోరు..

పాదయాత్రలో భాగంగా కవిత ఇంకా మాట్లాడుతూ.. పూటకో మాట.. రోజుకో వేషం వేసి కమెడియన్‌గా మాట్లాడుతూ నగర ప్రజలను కామెడీతో ఆకట్టుకుంటున్నాడని బండి సంజయ్‌ను విమర్శించారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన వారని.. ఇలాంటి కమెడియన్.. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్టుల మాటలు పట్టించుకోరని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డిసెంబర్ 29 దీక్ష దివస్ చాలా కీలకమైన ఘట్టమన్నారు. అదే స్ఫూర్తి తో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. జరుగుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో.. వందకు పైగా డివిజన్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నానన్నారు.

More News

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి - ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సినిమా థియేటర్లు రీ-ఓపెనింగ్‌తో పాటు రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం

మరోసారి ఆ డైరెక్టర్‌తో బాలయ్య..?

బాలకృష్ణ తన 106వ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

టెన్షన్‌కు తెర తీసిన సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి టెన్షన్‌ను క్రియేట్‌ చేశారు. ప్రజలకు, అభిమానులకు మాత్రం కాదు..

తల్చుకుంటే దుమ్ము దుమ్ము... నశం కింద కొడతా: కేసీఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది.

అయినా కిరికిరి పెడుతున్నారు నా కొడుకులు..: కేసీఆర్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది.