బండ్ల గణేష్ మాట్లాడితే అంతేగా.. ప్రభాస్, రాజమౌళిపై కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎక్కడున్నా తన ప్రత్యేకత చాటుకుంటాడు. మైక్ పట్టుకోగానే ఊగిపోయే గణేష్ తనదైన శైలిలో పంచ్ లు, సెటైర్లు వేస్తుంటాడు. త్వరలో జరగబోయే 'మా' ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హేమ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ముందు నుంచి మా ఎన్నికల విషయంలో యాక్టివ్ గా ఉంటున్న ప్రకాష్ రాజ్ నేడు తన ప్యానల్ సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడే. మీడియా సమావేశంలో మాట్లాడిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పై వస్తున్న నాన్ లోకల్ విమర్శలని తనదైన శైలిలో తిప్పికొట్టాడు. ఈ సందర్భంగా ప్రభాస్, రాజమౌళిల ప్రస్తావన తీసుకువచ్చాడు.
లోకల్, నాన్ లోకల్ ఏంటి.. ఇక్కడ పుట్టిన ప్రభాస్ నేడు ఇండియాని ఏలుతున్నాడు. రాజమౌళిని ఇంగ్లీష్ వాళ్ళు సినిమా తీయమని అడుగుతున్నారు. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏంటి అని గణేష్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు.
ప్రకాష్ రాజ్ గొప్ప వక్తి అని.. నటుడిగా రాణిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. తన సొంత ఊరు షాద్ నగర్ లోనే ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రకాష్ రాజ్ చేపట్టినట్లు గణేష్ తెలిపారు. ఇప్పటి వరకు మా అధ్యక్షులుగా పనిచేసిన వారంతా బాగా చేశారు. వారిని మించేలా ప్రకాష్ రాజ్ 'మా'ని ముందుకు తీసుకెళతారని..అందుకే తామంతా ఆయన వెనుక ఉన్నట్లు బండ్ల గణేష్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com