Bandla Ganesh: హాట్ టాపిక్ గా మారిన బన్నీపై బండ్ల గణేష్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై ఆయన ఈగ వాలనివ్వరు. అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు వీర విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగే అతికొద్దిమంది సినీ ప్రముఖులలో గణేశ్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే బండ్ల గణేష్ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలు తదితర అంశాలపై స్పందిస్తూ ట్వీట్లు చేస్తూ వుంటారు.
తండ్రి మాట వినకుండా బన్నీ సూపర్‌స్టార్ అయ్యాడట:
తాజాగా బండ్ల గణేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏకంగా అల్లు అరవింద్ ఫ్యామిలీపై. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొన్న బండ్ల .. అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీని కలిశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ... తండ్రి మాటను గౌరవించి ఆయన చెప్పిన దారిలో నడిస్తే అల్లు బాబీలా అవుతారు. అదే తండ్రి మాట వినకుండా తనకు నచ్చినట్లుగా చేస్తే బన్నీలా అవుతారు. మరి అల్లు బాబీగారిలా అవుతారా..? బన్నీ గారిలా అవుతారా ..? అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. ఆ మాటలతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. తండ్రి అల్లు అరవింద్ మాట విని బాబీ కష్టపడి చదువుకుని నిరాడంబరంగా వుంటారని, అదే బన్నీ విషయానికి వస్తే ఆయన నాన్న మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడని బండ్ల గణేష్ చెప్పాడు. ఆ మాటలను బాబీ సీరియస్‌గా తీసుకోకుండా సరదాగా నవ్వారు.
నోటి దురుసు తగ్గించుకుంటే బెటర్:
ప్రస్తుతం బండ్ల గణేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ నిజంగానే అల్లు అరవింద్ మాట వినలేదా... అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే నలుగురితో వున్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటూ బండ్లకు చురకలంటిస్తున్నారు. నోటి దురుసు తగ్గించుకోకుంటే తిప్పలేనంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments