పవన్ సినిమాపై రూమర్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించాడు గణేష్. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి గణేష్ దూరంగా ఉంటున్నాడు. సైలెంట్ గా తన వ్యాపారాలు చేసుకుంటున్నాడు. గణేష్ నిర్మాణంలో వచ్చిన చివరి చిత్రం టెంపర్.

ఇదీ చదవండి: ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచేసిన మహేష్‌.. కారణమేంటంటే..

ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నిర్మాతగా రాణించాలని గణేష్ భావిస్తున్నాడు. అందుకోసం తాను బాస్ గా భావించే పవన్ కళ్యాణ్ నే రిక్వస్ట్ చేశాడు. ఆ మధ్యన పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా గణేష్ తెలిపాడు. కానీ ప్రజెంట్ పవన్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికి తెలిసిందే. హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం రీమేక్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆ తర్వాతే బండ్ల గణేష్ తో సినిమాపై క్లారిటీ వస్తుంది.

కానీ బండ్ల గణేష్, పవన్ చిత్రానికి దర్శకుడిగా రమేష్ వర్మని ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో ఖిలాడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అటు సోషమీడియాలో, ఇటు అభిమానులలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.

తాజాగా బండ్ల గణేష్ ఈ వార్తని ఖండించాడు. ఇది రాంగ్ న్యూస్ అని తెలిపాడు. ఏమైనా ఖరారైతే వెంటనే ప్రకటిస్తామని తెలిపాడు.

More News

రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు

వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు..

పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.

వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. అయితే వ్యాక్సిన్ కొరత కూడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. 18-45 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ టీకా అభివృద్ధికి హైదరాబాదీ కంపెనీ సాయం

కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ క్రమంగా గ్లోబల్ హబ్‌గా మారబోతున్నట్టు కనిపిస్తోంది.