పవన్ సినిమాపై రూమర్.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
Send us your feedback to audioarticles@vaarta.com
గబ్బర్ సింగ్ చిత్రంతో బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించాడు గణేష్. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి గణేష్ దూరంగా ఉంటున్నాడు. సైలెంట్ గా తన వ్యాపారాలు చేసుకుంటున్నాడు. గణేష్ నిర్మాణంలో వచ్చిన చివరి చిత్రం టెంపర్.
ఇదీ చదవండి: ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచేసిన మహేష్.. కారణమేంటంటే..
ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నిర్మాతగా రాణించాలని గణేష్ భావిస్తున్నాడు. అందుకోసం తాను బాస్ గా భావించే పవన్ కళ్యాణ్ నే రిక్వస్ట్ చేశాడు. ఆ మధ్యన పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కూడా గణేష్ తెలిపాడు. కానీ ప్రజెంట్ పవన్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికి తెలిసిందే. హరిహర వీరమల్లు, అయ్యప్పన్ కోషియం రీమేక్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఆ తర్వాతే బండ్ల గణేష్ తో సినిమాపై క్లారిటీ వస్తుంది.
కానీ బండ్ల గణేష్, పవన్ చిత్రానికి దర్శకుడిగా రమేష్ వర్మని ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో ఖిలాడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అటు సోషమీడియాలో, ఇటు అభిమానులలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.
తాజాగా బండ్ల గణేష్ ఈ వార్తని ఖండించాడు. ఇది రాంగ్ న్యూస్ అని తెలిపాడు. ఏమైనా ఖరారైతే వెంటనే ప్రకటిస్తామని తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com