ఒంగోలు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్.. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో, దిగి రాక తప్పలేదుగా

  • IndiaGlitz, [Tuesday,December 28 2021]

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలు సెషన్స్‌ కోర్టుకు హాజరయ్యారు. చెక్‌బౌన్స్‌ కేసులో విచారణకు గాను ఆయన తన న్యాయవాదితో కలిసి వచ్చారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ రూ.95 లక్షలను అప్పుగా తీసుకున్నారు. అసలు వడ్డీతో కలిపి 1 కోటి 20 లక్షల రూపాయలకు గాను జెట్టి వెంకటేశ్వర్లుకు గణేష్ చెక్ రూపంలో చెల్లింపు చేశారు. అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో 2019లో బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీ చేసింది.

అయితే గణేష్‌ ఒక్కాసారి కూడా కోర్టుకు రాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈనెల 13న గణేష్‌కు అరెస్టు వారెంటు జారీచేసింది. దీంతో ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. దెబ్బకు దిగొచ్చిన బండ్ల గణేశ్.. ఈసారి విచారణకు హాజరవుతానని పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం వ్యక్తిగతంగా ఒంగోలు సెషన్స్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాదు ఇకపై ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరుకావాలని బండ్ల గణేష్‌ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఇన్నేళ్ల కెరీర్‌లో కమెడియన్‌గా, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్.. ఇపుడు హీరో అవతారమెత్తారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ సినిమాకి తెలుగు రీమేక్‌గా బండ్ల గణేశ్ నటించిన చిత్రం ‘‘ డేగల బాబ్జీ ’’. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహించారు.

More News

సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆసుపత్రిలో చేరిక, వ్యాక్సిన్ వేయించుకున్నా పాజిటివ్

భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కరోనాపై బ్రహ్మాస్త్రాలు.. భారత్‌లో అందుబాటులోకి మరో రెండు టీకాలు

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.

ముదురుతోన్న సినిమా టికెట్ల వివాదం, రంగంలో ఏపీ సర్కార్.. కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా  టికెట్ ధరల పెంపు, థియేటర్ల మూసివేత అంశం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

మెగా కోడలు ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ, ఏంటీ దాని ప్రత్యేకత ..!!

మెగా కోడలు, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన కామినేని.. భర్త రామ్‌చరణ్‌కు చేదోడువాదోడుగా వుంటారు.

బికినీలో సమంత... మళ్లీ ఫోటోలు వైరల్, గ్యాంగ్‌తో కలిసి గోవాలో చక్కర్లు

జీవితాన్ని నచ్చినట్లుగా కొనుగోలు చేసేవారు కొందరే వుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఖచ్చితంగా వుంటారు.