Bandla Ganesh:మల్కాజ్‌గిరి పార్లమెంట్ టికెట్ కోసం బండ్ల గణేష్ దరఖాస్తు

  • IndiaGlitz, [Friday,February 02 2024]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. సరైన అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులుగా బరిలో నింపాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. గాంధీభవన్‌లో ప్రత్యేకంగా ఓ కౌంటర్ ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువుగా విధించింది. తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలను కోరారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల పరిపాలన అద్బుతంగా ఉందని కొనియాడారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. ఫీజుల పేరుతో విద్యార్థుల రక్తం పీల్చి తాగుతున్నారని మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌లోకి వస్తానన్నా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

కాగా బండ్ల గణేష్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పుడు పార్టీకి అధికారంలోకి వస్తుందని సవాల్ చేసి బాగా ట్రోల్ అయ్యారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని బహిరంగంగా తన మద్దతు తెలియజేశారు. కచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. చెప్పినట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ఆనంధానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇటీవల ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. గులాబీ నేతల అవినీతిని బయటకు తీసి శిక్షించాలని రేవంత్ రెడ్డిని కోరారు.

ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి స్థానం దక్కించుకుంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. దీంతో మినీ ఇండియాగా పేరొందింది. ఈ సీటు దక్కించుకునేందుకు చాలా మంది ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, మధుయాష్కీ గౌడ్, తదితర ప్రముఖులు ఇందులో ఉన్నారు. తాజాగా బండ్ల కూడా దరఖాస్తు చేసుకోవడంతో మరి అధిష్టానం ఎవరికి సీటును కేటాయిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

More News

Poonam Pandey:బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే కన్నుమూత..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మోడల్‌గా, హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూనమ్ పాండే క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనంగా మారింది.

Sharmila:ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా.. జాతీయ పార్టీల నేతలతో భేటీ..

ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ ఆ అంశం గురించి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కనీసం స్పందించడమే మానేశారు.

Chiranjeevi:'విశ్వంభర' షూటింగ్‌లో జాయిన్ అయిన చిరంజీవి.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శత్వంలో

2047 నాటికి భారత్‌ అభివృద్ధే లక్ష్యం.. బడ్జెట్ విశేషాలు ఇవే..

2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు.

సలహాదారులకు రూ.680కోట్లు.. ఒక్క సజ్జలకే రూ.140కోట్లు: నాదెండ్ల

ప్రభుత్వ సలహాదారుల కోసమే వైసీపీ ప్రభుత్వం రూ.680కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు