డైరెక్టర్ని తిట్టుకుంటున్న బండ్ల గణేష్
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా ఓ హిట్ కొట్టిన డైరెక్టర్ని సదరు డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలో నటించిన నటుడు గట్టిగానే తిట్టుకుంటున్నాడట. ఇంతకు ఆ నటుడెవరో కాదు.. బండ్లగణేష్. ఆ డైరెక్టర్ అనిల్ రావిపూడి. చిన్నా చితక వేషాలు వేసుకుంటూ తర్వాత నిర్మాతగా మారి భారీ సినిమాలు నిర్మించిన బండ్లగణేష్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం అక్కడ అనుకోని దెబ్బలు తగలడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్లీ అతనికే సినిమా రంగమే కనపడింది.
అలాంటి సమయంలో అనిల్ రావిపూడి.. బండ్లగణేష్‌ని కలిసి `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో ఓ పాత్రను ఆఫర్ చేశాడు. చెప్పేటప్పుడు పాత్ర గురించి అద్భుతంగా చెప్పడంతో తన పాత్రకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుందని భావించిన బండ్ల సినిమాలో నటించడానికి వెంటనే ఓకే చెప్పేశాడు.కానీ తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత బండ్ల గణేష్‌కు పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే ఆయన పాత్ర రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువగా లేదు. అంతా ఎడిట్‌లో లేపేసారు. దీంతో ఆయన పాత్రకు ఆదరణ దక్కలేదు. సరి కదా! వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి పాత్రను ఎందుకు చేశావు? అని అడగటంతో బండ్ల మరింత బాధ పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన తనను కలిసి వాళ్లందరికీ చెబుతున్నాడట. అసలు తన పాత్రను మొత్తం తీసేసి ఉన్నా తాను బాధపడేవాడిని కానని, 90 శాతం పాత్రను ఎడిట్ చేసేశారని వాపోతున్నాడట బండ్ల గణేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments