పవన్‌కు పొగరు.. ఎంత పొగరంటే.. : రెచ్చిపోయిన బండ్ల గణేష్
Send us your feedback to audioarticles@vaarta.com
బండ్ల గణేష్.. నిన్న మొన్నటి వరకూ చూసిన వ్యక్తి వేరు.. ఆదివారం సాయంత్రం చూసిన వ్యక్తి వేరు. నిజానికి ఆయనలా మాట్లాడతారని.. మాట్లాడగలరని ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో వైభవంగా ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు గతంలో కనిపించిన బండ్ల గణేష్ వేరు.. ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి వేరని అనిపించింది. పవన్‌ను ఎయిర్‌పోర్టులో చూశానని చాలా పొగరు నడుకుంటూ వెళుతున్నారని చెప్పిన వ్యక్తికి తాను ఏం సమాధానం చెప్పాననే విషయాన్ని బండ్ల గణేష్ చెప్పిన తీరు ఆకట్టుకుంది.
‘‘అవును పవన్‌కు పొగరే.. ఎంత పొగరంటే.. పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ ...రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసం కట్టుకున్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపత...
శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా.... బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా.
పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా.... శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాన...గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్’’ అని బండ్ల గణేష్ వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ గారికి ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేద్దాం అని వెళ్తాను. ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కళ్లు చూడగానే అన్న... అన్నీ మర్చిపోతాను. ఆ కళ్లలో అంత నిజాయితీ ఉంటుంది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments