‘ఆర్ఆర్ఆర్’ టీంకు బండి సంజయ్ వార్నింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆర్ఆర్ఆర్’ టీంకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కుమ్రం భీం పాత్రకు టోపి పెట్టిన సన్నివేశాన్ని తొలగించకుండా ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి సినిమాను విడుదల చేస్తే.. రీళ్లను తగులబెడతామని హెచ్చరించారు. ఈ సినిమాపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ సినిమాను ఎలా నడిపిస్తారో చూస్తామన్నారు. హిందూమతాన్ని అవమాన పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. కాగా.. కొమ్రం భీం 119వ జయంతి సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం ఆయనకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌కు చెర్రీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ టీజర్ అటు ఎన్టీఆర్.. ఇటు రామ్ చరణ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. టీజర్ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
కాగా.. టీజర్ చివరిలో కుమ్రం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ఓ మతానికి సంబంధించిన టోపీతో కనిపించాడు. నిజానికి ఇలాంటి టోపీని కుమ్రం భీం ఎప్పుడూ ధరించలేదని.. అసలు అప్పట్లో ఆ మతానికి చెందిన కొందరు వ్యక్తుల ఆగడాలకు వ్యతిరేకంగానే కుమ్రం భీం పోరాడారని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. కాబట్టి సినిమా నుంచి ఈ సన్నివేశాన్ని తొలగించాలని హెచ్చరిస్తున్నాయి. లేదంటే సినిమాను అడ్డుకుని తీరుతామని ఆదివాసీ సంఘాలు, బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com