‘ఎవర్నీ వదలం.. బ్రేకుల్లేని బస్సులో పాక్ పంపుతాం’
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశ లౌకిక తత్వం, రాజ్యాంగ విలువల పరి రక్షణకు ఉద్దేశించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అసలు చట్టం గురించి వ్యతిరేకించే పార్టీలు, విమర్శకులు ఏం తెలుసు..? అంటూ బీజేపీ నేతలు ఈ చట్టంకు సంబంధించి అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారిపై తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నాడు వరంగల్‌లో సీఏఏకు అనుకూలంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది.
మీకు ఏది కావలంటే అదే..!
ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన బండి.. ఒకింత సహనం కోల్పోయి మాట్లాడారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎంఐఎం నాయకులారా.. మీకు ఈ గడ్డ మీద స్థానం లేదు. మీరు అవసరమైతే పాకిస్థాన్ పోతారో, బంగ్లాదేశ్ పోతారో, అఫ్గానిస్థాన్ పోతారో నిర్ణయించుకోండి. కావాలంటే మీకు విమానం, హెలికాప్టర్ ఇస్తాం. అవసరమైతే బ్రేకుల్లేని బస్సులో పంపిస్తాం. సీఏఏ వాస్తవ విషయాలను అంతా గ్రహించాలి. కేసీఆర్, ఒవైసీ సోదరుల ఆటలు తెలంగాణలో సాగవు.. సాగనివ్వం. కేసీఆర్, కేటీఆర్ యాగం చేసినప్పుడు.. అసదుద్దీన్ హిందుత్వ ఆరోపణలు ఎందుకు చేయలేదు?. 12 శాతం ఉన్న మైనార్టీల కోసం కక్కుర్తి పడుతున్న నేతలు.. 85 శాతం ఉన్న హిందువులను పట్టించుకోరా?. రంగురంగుల జెండాలు పట్టిన నేతలు వాటిని వదిలి.. కాషాయ జెండా పట్టుకునే సమయం దగ్గర్లోనే ఉంది. అవాస్తవాలను నిజాలుగా ప్రచారం చేసే ఇలాంటి వారికి ప్రజలంతా బుద్ధి చెప్పాలి’ అని బండి పిలుపునిచ్చారు.
మజ్లిస్‌పై తీవ్ర వ్యాఖ్యలు!
అంతటితో ఆగని ఆయన.. ‘ద్రోహుల్లారా ఖబడ్దార్.. మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం. కట్టెలు పడితే.. మేం కత్తులు పడతాం. నువ్వు రాకెట్లు పడితే, మేం లాంచర్లతో కొడతాం. యుద్ధం మొదలైంది. ఎవర్నీ వదిలిపెట్టం. ఓరుగల్లు నుంచే యుద్ధం ప్రారంభిస్తాం. నిజాం వారసులై వాళ్లు పచ్చ జెండా పట్టుకొని వస్తే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్ వారసులమై కాషాయ జెండా, కమలం పువ్వు చేత పట్టుకొని, భారత్ మాతాకీ జై అంటూ మనం వస్తున్నాం. ఈ యుద్ధంలో దేనికైనా సిద్ధమై ముందుకు పోదాం’ అని మజ్లిస్ పార్టీని ఉద్దేశించి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాగా.. సీఏఏకు వ్యతిరేకంగా అసదుద్దిన్ ఓవైసీ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తనపై, ముస్లిం సోదరులపై విమర్శలు గుప్పించిన వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అసద్.. బండి వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments