Bandi Sanjay:ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ తనను కలిశారని మోదీ వ్యాఖ్యానించడంతో కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు రేపుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి కేసీఆర్‌ ఇంట్లో గొడవలు మొదలయ్యాయని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కేసీఆర్‌ కోరికను ప్రధాని బయటపెట్టడంతో కేసీఆర్ అల్లుడు ఇంట్లో టీవీ పగలగొట్టారని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ శటికుడు కొడుకును ఇంట్లోకి రానివ్వడం లేదని.. కేసీఆర్ కుమార్తె కూడా లొల్లి పెట్టుకోనున్నారని తెలిపారు. అంతేకాకుండా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా బీఆర్‌ఎస్‌లో చీలిక రాబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్‌.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేరు కుంపట్లు పెడుతున్నారు..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పార్టీని వీడి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు రాత్రి నుంచే వేరు కుంపట్లు పెడుతున్నారని చెప్పారు. కేటీఆర్‌ను ఇప్పుడే భరించలేకపోతున్నామని.. ఇక సీఎం అయితే భరించగలమా అనే అభిప్రాయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ భ్రష్టు పట్టడానికి కేటీఆర్‌ వాడే భాషే కారణమన్నారు బండి. కేటీఆర్‌ ముఖంలోనే అహంకారం కనిపిస్తుందని.. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే తమ పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారని సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ అసలు కల్వకుంట్ల అజయ్ రావు అని.. మంత్రి పదవి కోసం కల్వకుంట్ల తారక రామారావు అని కేసీఆర్ పేరు పెట్టారని పేర్కొ్న్నారు.

దళితుడని ఎందుకు సీఎం చేయలేదు అని ప్రశ్న..?

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ తెలంగాణపై విషం చిమ్మారని కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మోడీ తెలంగాణపై విషం చిమ్మితే... బీఆర్‌ఎస్‌ ఎంపీలు సభలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ విషం చిమ్మారని కేటీఆర్‌ ఒక్కరికే వినపడిందా అంటూ ప్రశ్నించారు. ట్విట్టర్‌ టిల్లు అయిన కేటీఆర్ ఒళ్లు మొత్తం విషం నింపుకుని పక్కవాళ్లపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణే మా కుటుంబం అని చెబుతున్న కేటీఆర్.. ఓ దళితుడిని సీఎం చేస్తానని ఎందుకు చేయలేదని నిలదీశారు. నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. వారి కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నట్లు ఉందన్నారు.

తెలంగాణ రాక ముందు.. వచ్చాక.. కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని..?

రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని.. రాష్ట్రం వచ్చిన పదేళ్ల తర్వాత ఆస్తులు ఎన్ని? అని బండి ప్రశ్నించారు. ఎలాంటి వ్యాపారాలు చేయని కుటుంబానికి ఇన్ని రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని మండిపడ్డారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగిన ఎన్నికలకు పంచడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. కేసీఆర్ ఫ్యామిలీ కన్నా పెద్ద చీటర్లు ప్రపంచంలోనే ఎవరూ లేరని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని.. కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

More News

Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు .. స్పందించని జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరగనున్న తన వారాహి యాత్రలో దాడులు చేస్తారని..

Asian Games:ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట.. ఆర్చరీలో బంగారు పతకం

ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో

Ramcharan:ముంబై సిద్ధి వినాయకుని ఆలయంలో రాంచరణ్.. అయ్యప్పస్వామి మాల దీక్ష విరమణ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్‌గా నిలిచారు.

Sikkim:సిక్కింను ముంచెత్తిన భారీ వరదలు.. 23 మంది జవాన్లు గల్లంతు

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుండడంతో లాచెన్ లోయలోని తీస్తా నది నీటిమట్టం