Bandi Sanjay:ఎన్నికల సమయంలో బండి సంజయ్‌కు కీలక పదవి
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. నరేంద్రమోదీ(PM Modi)ని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో ఎన్నికల కోసం కసరత్తు సాగిస్తోంది. 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించింది. బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమించింది.
ఇందులో తెలంగాణకు చెందిన ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay)కు కీలక పదవి అప్పగించింది. బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా ఇంఛార్జిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. అలాగే యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్లను ప్రకటించారు. కాగా గతేడాది జులైలో చివరిసారిగా బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను పునర్‌వ్యవస్థీకరించింది.
కాగా ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి కూడా ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఆయనకు కిసాన్ మోర్చా పదవిలో కట్టబెట్టి కీలక బాధ్యతలు అప్పగించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో అనే అనిశ్చితి మొదలైంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kisan Reddy) కూడా సిట్టింగ్ ఎంపీలకు సీటు ఉంటుందనే గ్యారంటీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments