Vijayashanti:గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై బండి సంజయ్ పోటీ? విజయశాంతి ట్వీట్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల సమరం నెలకొంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ కూడా ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు అని కార్యకర్తల విశ్వాసం. అందుకు గజ్వేల్ నుండి బండి సంజయ్, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్‌పై పోటీ చేయాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా కార్యకర్తలు అడగటం తప్పు కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం నా ఉద్దేశ్యం కానప్పటికీ... వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అన్నది సత్యమైన వాస్తవం" అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గజ్వేల్ నుంచి పోటీగా తాను బరిలోకి దిగుతానని ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు.
ప్రచారంలోకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రచారంలో పాల్గొనే ముఖ్య నేతల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. ఈనెల 20న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని.. 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, 31న యూపీ సీఎం ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు..
మరి ముఖ్యంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య విమర్శల వేడి రాజుకుంది. రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు బీమా ఇస్తామంటూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొనడం పట్ల అరవింద్ వ్యంగ్యంగా స్పందించారు. కేసీఆర్ చనిపోతే రూ.5 లక్షలు, కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలు, కవిత చనిపోతే రూ.20 లక్షలు ఇస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. ఇదేం సంస్కారం అరవింద్ మీలాంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన టైమ్ వచ్చేసిందన్నారు. దీనిపై అరవింద్ తిరిగి స్పందిస్తూ రైతులు చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా..? మీకేమైనా కళ్లు బైర్లు కమ్మాయా? అంటూ ప్రశ్నించారు. ఎవరైనా చనిపోతే రూ.5 లక్షలు ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం ఏంటని నిలదీశారు.
బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023
అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు.
అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments