బండారు దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన నేడు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి.. ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో చెట్టు పూర్తిగా నేలకొరిగింది. ఈ ప్రమాదంలో దత్తాత్రేరయకు ఎలాంటి గాయాలు అవకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవాళ సూర్యపేట పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్‌లో గవర్నర్ దత్తాత్రేయకు పౌర సన్మానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయ వెంట డ్రైవర్‌తో పాటు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. దత్తాత్రేయ సహాయకుడికి ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అయితే దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోయినందునే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout