హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: సీపీ సజ్జనార్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ ఏడాది మార్చి నుంచి అన్ని పండుగలపై ఆంక్షలు కొనసాగాయి. ఇక కరోనా మహమ్మారి నుంచి కాస్త విముక్తి లభిస్తోందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా కొత్త రూపం దాల్చుకుని పరిస్థితులను మరింత విషమంగా మార్చేసింది. ఈ దెబ్బ హైదరాబాద్‌లోని న్యూ ఇయర్ వేడుకలకు కూడా తగిలింది. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్‌కి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు.
నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. రిసార్ట్స్, పబ్‌లపై నిఘా పెడతామన్నారు. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు చేపడతామన్నారు. నగరంలో పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదన్నారు. స్టార్ హోటల్స్‌లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. ఎలాంటి ఈవెంట్లకు సైబరాబాద్ పరిధిలో అనుమతి లేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలోనూ న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని సీపీ సజ్జనార్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout