ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధం: ఎవరూ బయటికి రావొద్దు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి గంటగంటకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా కేంద్రం మరికొన్ని ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ, వాణిజ్య విమానాలకు అనుమతి నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు.. ఈ నెల 22 నుంచి కనీసం వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఉండదని ప్రకటనలో స్పష్టం చేసింది.

బయటికి రానివ్వకండి.. రావొద్దు!

‘65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలి..బయటికి రావొద్దు. మరీ ముఖ్యంగా 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగనివ్వరాదు. వారి తల్లిదండ్రులే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు విమానాశ్రయాల నుంచి తప్పించుకుని రైలు మార్గాలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లిపోతున్నందున వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే విమాన సర్వీసుల నిలిపివేత తప్పదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. విమాన నిలిపివేత 22 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అప్పటివరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా భారత్ చేరుకునే ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్వారంటైన్ శిబిరాలకు తరలించాలి. వాళళ్లందర్నీ 14 రోజుల పరిశీలన తర్వాత వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే బయటికి పంపాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర దిశానిర్దేశం చేసింది.

ఆందోళన వద్దు.. తీసుకొస్తాం..!

కాగా ఇటలీతో పాటు పలుదేశాల్లో ఇండియన్స్ ఉండిపోయారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇందుకు స్పందించిన కేంద్రం.. విదేశాల్లో  ఐదే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మాత్రం ప్రత్యేక విమానాలను పంపించి మరీ ఇండియాకు తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

More News

విల‌నిజాన్ని చూపించబోతున్న భూమిక

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖుషీలో న‌టించిన భూమిక చావ్లా హీరోయిన్‌గా స్టార్ హీరోల‌తో న‌టించింది. అదే స‌మ‌యంలో నిర్మాత‌గా మారింది.

నాని సినిమాకు సీక్వెల్ ఉందా ?

నాని సినిమాకు సీక్వెలా ఉందా? అవును నాని నిర్మిస్తున్న హిట్ సినిమాకు సీక్వెల్‌గా హిట్ 2 చేస్తున్నారుగా అనుకునురు. కానీ ఇక్క‌డ నాని నిర్మాత‌గా చేస్తున్న సినిమా కాదు. నాని హీరోగా చేసిన సినిమా.

మహారాష్ట్ర భక్తుడి ఎఫెక్ట్ : తిరుమలలో దర్శనాలు నిలిపివేత

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునిపై కూడా పడింది. ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ తాజాగా.. స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ..

ఆశలు ఆవిరి.. నిర్భయ నిందితులకు రేపే ఉరి..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీంకోర్టు, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో

కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. ఇలా చేయండి..: చిరంజీవి

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్‌లో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను