నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
గానగంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినీలోకం మొత్తం విలపించింది. నేడు అయన జయంతి కావడంతో సినీ ప్రముఖులు బాలుగారితో ఉన్న బంధాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు.
చిరంజీవి ట్విట్టర్ లో బాలు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా బాలుగారితో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. ఓ సందర్భంలో నేను బాలుగారిని 'ఎస్పీ బాలుగారు' అని సంభోదించాను. ఆ పిలుపుకు ఆయన బాధపడ్డారు.. కోపగించుకున్నారు. ఎప్పుడూ ప్రేమగా అన్నయ్య అని పిలిచేవాడివి.. ఇప్పుడు మర్యాదగా బాలుగారు అంటున్నావు.. ఏమైంది. నన్ను దూరం పెడుతున్నావా అని కోపంగా అన్నారు.
మీలాంటి వారిని ఏకవచనంతో పిలవడం సరికాదు అనిపించింది అని చెప్పాను. కానీ ఆయన వినలేదు. అలా పిలిచి నన్ను దూరం చేయొద్దు అని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. అందరికి దూరమై అన్యాయం చేశారు అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా బాలుగారి సోదరి ఎస్పీ వసంత పాడిన పాటని కూడా చిరంజీవి పొందుపరిచారు. చిరంజీవి కెరీర్ ని నెమరు వేసుకుంటే అందులో సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ బాలు పడినవే ఉంటాయి. ఇంద్ర చిత్రంలో బాలు చిరంజీవితో కలసి నటించారు.
అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి ! #TearfulTributeToSPB #SPB75 #SPVasantha https://t.co/c1oEvrv4y1
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments