Balka Suman: రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు.. బాల్క సుమన్

  • IndiaGlitz, [Monday,February 05 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపించి రెచ్చిపోయారు. మంచిర్యాల జిల్లా పార్లమెంట్ స్థాయి సమావేశంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను లంగా అని మాట్లాడుతున్నాడు.. ఈ రండగాడు.. హోలేగాడు అంటూ ఊగిపోయారు. ఈ చెత్త నా కొ..కుని చెప్పుతో కొట్టినా తప్పు లేదంటూ చెప్పు తీసి చూపించారు.

సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అని ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని మండిపడ్డారు. రైతుబంధు కోసం గ‌త ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కాంట్రాక్ట‌ర్ల‌ జేబుల్లోకి మళ్లించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు కేంద్రం కానీ పక్క రాష్ట్రాల వాళ్లు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడ్డారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి పోయాయని ఎద్దేవా చేశారు. ఓటమితో భయపడాల్సిన పని లేదని, గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కోసమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఆంధ్రా ముఖ్యమంత్రులనే తట్టుకొని నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేశామని వ్యాఖ్యానించారు.

బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి చెప్పు చూపిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గులాబీ జెండా అనేది లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సుమన్ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

More News

Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తే కఠిన చర్యలు.. పార్టీలకు ఈసీ హెచ్చరిక..

త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనన్ను తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

Chandrababu: సీఎం జగన్.. అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు: చంద్రబాబు

సీఎం జగన్ అర్జునుడు కాదని.. అక్రమార్జునుడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి, అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు..

వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌ పంపించారు.

జనసేనకు దారుణంగా సీట్లు తగ్గించిన చంద్రబాబు.. రగిలిపోతున్న జనసైనికులు..

అధికారంలోకి రావాలంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు చారిత్రక అవసరమని ఊదరగొట్టారు.

Zakir Hussain, Shankar Mahadevan:గ్రామీ అవార్డుల్లో సత్తా చాటిన జాకీర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్

యాక్టింగ్ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎంత ముఖ్యమో.. సంగీత రంగంలో గ్రామీ అవార్డులు అంతే ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమై అవార్డులకు ప్రాముఖ్యత ఉంది.