బాల్కసుమన్-పద్మారావ్.. ఔర్ ఏక్ ప్రేమ్ కహానీ!!

  • IndiaGlitz, [Monday,February 25 2019]

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సీఎం కేసీఆర్ మొదలుకుని ప్రతిపక్షనేత భట్టీ విక్రమార్క, కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు, సన్నిహితులు వారితో ఉన్న అనుబంధాన్ని, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ఇంతవరకూ ఎవరికీ తెలియని విషయాలను అసెంబ్లీ వేదికగా చెపపారు. మొదట పద్మారావు శుభాకాంక్షలు తెలిపిన బాల్కసుమన్.. బాల్కసుమన్-పద్మరావ్ ఔర్ ఏక్ ప్రేమ్ కహానీ మొదలుపెట్టారు. అసలు ఆయన ఏమన్నారు..? బాల్కసుమన్ ఏం చెప్పారు..? ఈ ప్రేమ కహానీ సంగతేంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యక్షా.. చాలా సంతోషంగా ఉంది..!

శాసనసభలో బాల్క సుమన్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నందుకు.. నేను ఇంత దూరం రావడానికి దోహదపడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్కర్ గారికి.. అదే విధంగా మా నాయకుడు, మా మార్గ నిర్దేశకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి హృదయపూర్వకంగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను. 30 ఏళ్ల వయస్సులో పార్లమెంట్‌ సభ్యునిగా, 35 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మీరు డిప్యూటీ స్పీకర్‌గా రావడం చాలా సంతోషంగా ఉంది.. మిమ్మల్ని వ్యక్తిగతంగా, ఉద్యమనాయకుడిగా మేం చాలా ఇష్టపడతాం. దశాబ్దానికి పైగా ఉస్మానియా యూనివర్శిటికి పక్కనే మీరుండి మీరు ఎన్నిరకాలు అండదండలు అందించారో మేం మర్చిపోలేం. కేసులపాలైనప్పుడు, జైళ్లలో ఉన్నప్పుడు ఇలా అనేక సందర్భాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్న ‘నేనున్నాను’ అంటూ పూర్తిస్థాయిలో ముందుండి నడిపిన ప్రోత్సాహాన్ని, తోడ్పాటును మేం ఎప్పుడూ మరిచిపోలేం అని బాల్కసుమన్ చెప్పుకొచ్చారు.

చెప్పకూడదంటూనే మొత్తం చెప్పేశారుగా..!

అధ్యక్షా.. మీరు నోరు చాలా మంచిది.. అలాగే మీ మనస్తత్వం కూడా మంచిది. ఈ విషయం అసెంబ్లీలో చెప్పొచ్చు.. చెప్పకూడదో తెలియదు కానీ నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2012లో నేను ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనప్పుడు నాకు ఏమీ లేదని మా అత్తమామలు ఆలోచించారు. అలాంటి సందర్భంగా మీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని.. మీరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రవణ్‌‌ పెద్ద మనసుతో మా అత్తమామల దగ్గరికెళ్లి దాదాపు రెండు విడతలుగా వారిని ఒప్పించారు. కచ్చితంగా బాల్కసుమన్ ఎమ్మెల్యే అవుతాడు.. మంచి పొజిషన్‌లో ఉంటాడు.. కేసీఆర్‌కు దగ్గరవుతాడు.. మంచి పిల్లగాడు అని వాళ్లను ఒప్పించారు. ముఖ్యంగా నా పెళ్లి కావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అనంతరం నా పెళ్లి కూడా దగ్గరుండి మీరే జరిపించినందుకు (నవ్వుతూ..) మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.. (పద్మారావు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు) అని ఎమ్మెల్యే బాల్కసుమన్ చెప్పుకొచ్చారు. బాల్కసుమన్ మాటలు విన్న సభ్యులు అంతా నవ్వుకున్నారు. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు అసెంబ్లీలో నవ్వులు పూశాయి. అనంతరం పలు విషయాలు మాట్లాడిన బాల్కసుమన్ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా ఇవాళ అసెంబ్లీ మొత్తమ్మీద బాల్కసుమన్ స్పీచ్ హైలైట్‌‌గా నిలిచి నవ్వులు పూయించిందని చెప్పుకోవచ్చు.

More News

షారూక్ స్థానంలో కౌశ‌ల్‌...

భార‌త‌దేశం త‌రపున తొలిసారి చంద్రునిపై కాలు పెట్టిన వ్యోమ‌గామి రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు ప్రారంభ‌మైయ్యాయి.

జ‌పాన్‌కు ప్ర‌భాస్‌, అనుష్క‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించి పెట్టిన చిత్రం `బాహుబ‌లి`.

కార్తీ రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో

రియల్‌ఎస్టేట్ రంగానికి తియ్యటి శుభవార్త

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా అందరికీ శుభవార్తలు చెబుతూ వెళ్తోంది.

క్షమాపణలు చెప్పి.. జగన్‌‌కు చింతమనేని సవాల్

పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.