తోపుడు బండిపై కూరగాయలమ్ముతున్న ‘బాలికా వధు’ డైరెక్టర్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాలికా వధు’ సీరియల్ గుర్తుందా? తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’గా ప్రసారమైంది. ‘స్టార్ మా’లో ప్రసారమైన ఈ సీరియల్.. ప్రేక్షక లోకాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి క్యారెక్టర్ ఎంతో అద్భుతం. స్కూలుకెళ్లే వయసులోనే చిన్నారులకు వివాహం చేస్తే తరువాత ఎదురయ్యే పరిణామాలు ఎలాంటి ఉంటాయో ఈ సీరియల్‌లో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సీరియల్‌ను ప్రతి గడపకూ చేర్చడంలో ఎపిసోడ్ డైరెక్టర్‌గా, యూనిట్ డైరెక్టర్‌గా రామ్ వృక్ష గౌర్ కృషి మరువలేనిది.
అలాంటి దర్శకుడు ఇప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఏదో షూటింగ్ కోసం అనుకుంటే పొరపాటే. ముమ్మాటికీ నిజంగా ఆయన కూరగాయలను తన జీవనం గడుపుకోవడం కోసం అమ్ముతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో గౌర్ కూడా ఒకరు. దీంతో ఆయన యూపీలోని అజంఘర్ పట్టణంలో రామ్ వృక్ష గౌర్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్నారు.
మీడియా ఆయనను కారణం ఏమిటని అడగ్గా.. ఓ సినిమాను తెరకెక్కించాలనే ఉద్దేశంతో అజంఘర్‌కు వచ్చానని అయితే అక్కడకు వెళ్లిన కొంతకాలానికే లాక్‌డైన్ విధించారని దీంతో తాను తిరిగి వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ సమయంలోనే తను తెరకెక్కించాలనుకున్న చిత్ర నిర్మాత కూడా సినిమాను నిలిపివేశారని తెలిపారు. ఏడాది తర్వాత చూద్దామన్నారని గౌర్ వెల్లడించారు. తన తండ్రి కూరగాయల వ్యాపారని.. ఈ కష్ట కాలంలో తాను కూడా అదే వ్యాపారాన్ని ఎంచుకున్నానని.. దీనికి తానేమీ ఫీలవడం లేదని ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments