అగష్టు 15న 'భలే భలే మగాడివోయ్' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Thursday,August 06 2015]

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజిగా వుంది.

ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టంతో యూనిట్ స‌బ్యులంద‌రూ ఆనందంగా వున్నారు. నేష‌న‌ల్‌ అవార్డ్ గ్ర‌హీత ప్రముఖ సంగీత ద‌ర్శ‌కులు గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందించిన ఈచిత్ర ఆడియో ని స్వాతంత్ర‌దినోత్స‌వ సంధ‌ర్బంగా అగ‌ష్టు 15న ప్ర‌ముఖుల మ‌రియు అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా...

హీరో నాని మాట్లాడుతూ: " భలే భలే మగాడివోయ్ షూటింగ్ పూర్త‌యింది.నటించ‌టానికి వీలున్న మంచి పాత్ర చేశాన‌న్న తృప్తివుంది. మారుతి తొ ప‌నిచేయ‌టం చ‌లా హ్య‌పిగా వుంది. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి మంచి కోస్టార్.అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations బ్యాన‌ర్ లో బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. న‌వ్విస్తూనే వుంటాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. " అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: మా చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వుంది. ఇప్ప‌డు ఆడియో వేడుక‌కి సిధ్ధ‌మ‌వుతుంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గోపిసుంద‌ర్ అందించిన ఆడియోని స్వాతంత్ర‌దినోత్స‌వం సంధ‌ర్బంగా అగ‌ష్టు 15న విడుద‌ల చేస్తున్నాము. ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫ‌రెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ రెస్పాన్స్ బాగుంది. మెమ‌రి నిల్‌..ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్ అనే క్యాప్ష‌న్ అంద‌రికి ఆక‌ట్టుకుంది.

ఇటీవ‌ల గోవాలో తీసిన సాంగ్ మ‌రియు టైటిల్ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. శేఖ‌ర్ మాస్ట‌ర్ వేయించిన స్ట‌ప్స్ విజిల్స్ కొట్టించేలా వుంటాయి. నిజార్ కెమెరా వ‌ర్క్‌ సూప‌ర్బ్ గా వుంటుంది. నేను ఏ క‌థ తీసుకున్నా కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాను. క‌థ‌లోనే కామెడి, కేర‌క్ట‌ర్స్ లోనూ కామెడి వుండ‌టంతో చిత్రం ఆద్యంతం న‌వ్వుతూనే వుంటారు. నిర్మాత బ‌న్నివాసు తో మ‌రోక్క‌సారి చేయటం ఆనందంగా వుంది. ఈచిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కున్ని ఆక‌ట్టుకునేలా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందింది. అని అన్నారు

నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ "ఏక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాం. మారుతి అనుకున్న‌ది అనుకున్న‌ట్టే తీసాడు. షూటింగ్ టైం లోనే యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశారు. కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కించాడు. నాని చాలా బాగా న‌టించారు. ఆయ‌న కేర‌క్ట‌ర్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిని మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మెమ‌రి నిల్‌.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్ అనే క్యాప్ష‌న్ చాలా కొత్తగా వుంద‌ని అంద‌రూ అంటున్నారు.

ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంట‌ర్టైన్‌మెంట్‌ తో చిత్రీకరించాం. చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది.అగ‌ష్టు 15న భలే భలే మగాడివోయ్ ఆడియో రిలీజ్ చేస్తాం. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గోపిసుంద‌ర్‌ అందించిన ఆడియో ఈ ఇయ‌ర్ లో వ‌న్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో గా నిలుస్తుంది. చిత్రం కూడా ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా వుంటుంది. ఆడియో వేడుక‌కి చిత్ర ప్ర‌ముఖులు విచ్చేస్తారు" .అని అన్నారు.

More News

Trisha's important update about Kamal Haasan's 'Thoongavanam'

Versatile star Kamal Haasan’s recent film ‘Papanasam’ has become a unanimous success and is still retained in screens even after the ‘Baahubali’ and ‘Maari ’ storm. It has also reportedly joined the proud list of films which have garnered Rs.100 crores collections......

Prakash Raj is a father figure: Tejus

Tejus, who shot to fame with Prakash Raj's Ulavacharu Biriyani, will be seen as a conman in Ketugadu, directed by Kittu Nallari. “I will be seen as a guy who has no family and eventually, I meet this girl and I connect with her,” shares Tejus about his character in the film.

I can't read Telugu : Mahesh Babu

Mahesh Babu, who is awaiting the release of 'Srimanthudu', revealed that having grown up in Chennai, he didn't learn Telugu.

BAJRANGI BHAIJAAN reaches the prestigious Busan International Film Festival

After breaking all box office records and fast moving closer to the enviable 300 crore mark at the Box Office BAJRANGI BHAIJAAN has added yet another feather in its cap. The latest being the movie has been selected at the prestigious Busan International Film Festival (BIFF), regarded as one of the most significant film festivals in Asia.

Rajamouli's father to direct Superstar?

With the back to back successes of 'Baahubali' and 'Bajrangi Bhaijaan', Rajamouli's father Vijayendra Prasad has become the most sought after writer in India now.