‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో: చరణ్‌కు ధీటుగా స్టెప్పులేసిన చిరు.. అభిమానులు పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘ఆచార్య’’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కోవిడ్ మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు పరిస్థితులు చక్కబడటంతో ఏప్రిల్ 29న ఆచార్యను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగాస్టార్ అభిమానులు డిజాప్పాయింట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లోకి దిగిన ఆచార్య టీమ్.. రీసెంట్‌గా ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఈ రోజు సినిమాలోని ‘‘భలే భలే బంజారా’’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ పాటను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని ముందే చెప్పిన చిత్ర యూనిట్.. దీనిలో భాగంగా ప్రోమోను వదిలింది. ఇందులో డ్యాన్స్‌కి పెట్టింది పేరైన చిరంజీవి, రామ్‌చరణ్‌లు మాస్ స్టెప్పులతో రచ్చరచ్చ చేశారు. భలే భలే బంజారా సాంగ్ కు సంబంధించి .. ‘హే సింబా రింబా.. చిరుతా పులులా చిందాటా.. సింబా రింబా సరదా పులులా సయ్యాట అంటూ ఓ చరణాన్ని వదిలారు. మరి ఫుల్ సాంగ్ చూడాలంటే రేపు సాయంత్రం 4:05 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిందే.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన 'లాహె లాహె', 'నీలాంబరీ' ‘శానా కష్టం’ పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్‌తో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ డైరెక్షన్‌లో ‘‘వాల్తేర్ వీరయ్య’’, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మెగాస్టార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments