బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ పేరు చెప్పగానే ముత్తు, నరసింహ, దశావతారం, స్నేహం కోసం లాంటి సెన్సేషనల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళంలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఆయన. రీసెంట్ గా రవికుమార్ తెలుగులో బాలయ్యతో రూలర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన జై సింహా హిట్టైంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ.. అనేక ఆసక్తికర అంశాలు రివీల్ చేశారు. బాలయ్యతో తన వర్క్ ఎక్స్పీరియన్స్ చెబుతూ..ఆయనకు కోపం ఎక్కువే. అలాగని ఎప్పుడూ మనసులోనే పెట్టుకోరు. బాలయ్య కోపం ఆ టైం వరకే పరిమితం. దర్శకుల ఆర్టిస్ట్ బాలయ్య అని కితాబిచ్చారు.
ఇదీ చదవండి: ఎవరో చేస్తున్నారంటూ కించపరుస్తూ మాట్లాడుతున్నారు: చిరు ఆవేదన
తెలుగులో చిరంజీవితో కూడా రవికుమార్ స్నేహం కోసం అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం విజయం సాధించింది. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెం 150 తర్వాత ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని రవికుమార్ అన్నారు. అప్పటికి ఇంకా సైరా చిత్రం ప్రారంభం కాలేదు.
ఓ రోజు చిరంజీవి గారు నన్ను కలవడానికి చెన్నైలో నేరుగా నా ఆఫీస్ కే వచ్చారు. చిరంజీవి గారు నా కోసం వచ్చారా అని ఆశ్చర్యపోయా. న తర్వాతి చిత్రం సైరా ఓ హిస్టారికల్ మూవీ. దాని ప్రీప్రొడక్షన్ పూర్తి కావడానికి 6 నెలల టైం పడుతుంది. ఈ గ్యాప్ లో వేగంగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నా. దర్శకుడు ఎవరైతే బావుంటుంది అని ఆలోచించగా మీరు గుర్తుకు వచ్చారు. అందుకే మీ వద్దకు వచ్చా అని చిరంజీవి నాతో అన్నారు. ఏదైనా కథ రెడీగా ఉంటే చెప్పండి చేద్దాం అని అన్నారు.
కానీ ఆ సమయంలో నా దగ్గర కథ లేదు అని రవికుమార్ అన్నారు. అంత దూరం నుంచి చిరంజీవి గారు నా కోసం వచ్చారు. ఆ రెప్యుటేషన్ నాకు చాలు అని రవికుమార్ ఇంటర్వ్యూలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments