మరోసారి అలాంటి పాత్ర చేయబోతున్న బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తోన్న 106వ చిత్రమిది. ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినీ వర్గాల్లో వినపడుతోన్న సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనపడబోతున్నారట. అందులో ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని టాక్. ఫ్యాక్షనిస్ట్ పాత్రలో బాలకృష్ణ నటించడం కొత్తేమీ కాదు.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల్లో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటించారు.
ఆ సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తనకు అచ్చొచ్చిన పాత్రలోనే బాలకృష్ణ నటించనున్నారట. మరో పాత్ర అఘోరా పాత్ర అని టాక్. ఈ పాత్ర కోసమే బాలకృష్ణ గుండ్ లుక్‌లో కనపడుతున్నారనేది సమాచారం. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రెండు భారీ హిట్స్ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై ఉన్న అంచనాలు ఎలా ఉంటాయో బోయపాటికి తెలుసు. అలాగే బాలయ్యను ఫ్యాక్షనిస్ట్ పాత్రలో ప్రేక్షకులు చూసి చాలా కాలమైంది. మరి ఆయనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ పాత్ర ఎలా కలిసి వస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com