బాలయ్య సినిమాలో ఆమెకు నో చెప్పేశారు...

  • IndiaGlitz, [Friday,November 06 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న బాల‌కృష్ణ.. కోవిడ్ ప్ర‌భావిత నేప‌థ్యంలో అంద‌రి స్టార్స్‌ను ఫాలో అవుతూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కొత్త షెడ్యూల్‌ను రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నార‌ని స‌మాచారం.

బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్‌ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్‌గా ఇద్దరు హీరోయిన్స్‌ పేర్లు వినిపించాయి. ఓ హీరోయిన్‌గా పూర్ణ నటిస్తుందని, మరో హీరోయిన్‌గా ప్రయాగమార్టిన్‌ నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఫొటోషూట్‌లో బాలయ్య పక్కన్న ప్రయాగ మార్టిన్‌ సూట్‌ కావడం లేదని యూనిట్‌ భావించింది. దాంతో ఆమెను తప్పించి ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మ‌రి ఈ వార్త‌ల‌పై బాల‌య్య క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.