బాలయ్య వందో సినిమాలో రాజమాత ఎవరు..
Wednesday, March 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమాని ఉగాది రోజున ప్రకటించనున్న విషయం తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణ కథాంశంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ కోసం అందాల తార నయనతారను సంప్రదిస్తున్నారు. ఒకవేళ నయనతార నో చెబితే వేరే హీరోయిన్ ఎవరైతే బాగుంటారని క్రిష్ టీమ్ ఆలోచిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన రాజమాత గౌతమి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్స్ హేమామాలిని, శోభనను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరిలో ఎవరు రాజమాతగా నటించనున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రం షూటింగ్ ను ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments