Balayya:సీఎం జగన్ టార్గెట్‌గా అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య పంచ్‌లు!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ టాక్ షో 3వ సీజన్ ఆహాలో ప్రసారానికి సిద్ధమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ టీమ్ సందడి చేసింది. ఈనెల 17న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. "సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి" అని డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బాలయ్య చెబుతాడు. ఈ డైలాగ్ వింటే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై మాట్లాడినట్లు అర్థమవుతోంది.
ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించే డైలాగ్స్ అంటూ చర్చ..
ఈ డైలాగ్‌ను ఏపీ రాజకీయాలకు ముడిపెడుతున్నారు అభిమానులు. "ఆంధ్ర రాష్ట్రం బాగునప్పుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి మొత్తం నాశనం చేశారు. దాన్ని మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలంటే ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే అంతా సెట్ చేస్తారు" అనే ఉద్దేశంతో బాలయ్య ఈ డైలాగ్ చెప్పారని చెబుతున్నారు. అలాగే "మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు " అంటూ ప్రొమో ప్రారంభంలోనే బాలకృష్ణ పంచ్ డైలాగ్ పేల్చారు. ఇది కూడా వైసీపీ నేతలను ఉద్దేశించే చెప్పారనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఈనెల 19న విడుదల కానున్న 'భగవంత్ కేసరి'..
ఇక 'భగవంత్ కేసరి' సినిమా విషయానికొస్తే బాలయ్య తెలంగాణ యాసలో నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సీనియర్ హీరోయిన్ కాజల్ బాలయ్యకు జోడిగా, యంగ్ హీరోయిన్ శ్రీలల ఆయనకు కూతురిగా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో ఊపు మీదున్న బాలయ్యకు ఈ సినిమా కూడా హ్యాట్రిక్ విజయం అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com