Balayya:సీఎం జగన్ టార్గెట్‌గా అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య పంచ్‌లు!

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ టాక్ షో 3వ సీజన్ ఆహాలో ప్రసారానికి సిద్ధమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ టీమ్‌ సందడి చేసింది. ఈనెల 17న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా అయినా, లైఫ్ లో అయినా, అంతా బాగున్నపుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి అని డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బాలయ్య చెబుతాడు. ఈ డైలాగ్ వింటే ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై మాట్లాడినట్లు అర్థమవుతోంది.

ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించే డైలాగ్స్ అంటూ చర్చ..

ఈ డైలాగ్‌ను ఏపీ రాజకీయాలకు ముడిపెడుతున్నారు అభిమానులు. ఆంధ్ర రాష్ట్రం బాగునప్పుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి మొత్తం నాశనం చేశారు. దాన్ని మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలంటే ప్రస్తుతం జైలులో ఉన్న చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే అంతా సెట్ చేస్తారు అనే ఉద్దేశంతో బాలయ్య ఈ డైలాగ్ చెప్పారని చెబుతున్నారు. అలాగే మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు అంటూ ప్రొమో ప్రారంభంలోనే బాలకృష్ణ పంచ్ డైలాగ్ పేల్చారు. ఇది కూడా వైసీపీ నేతలను ఉద్దేశించే చెప్పారనే చర్చ జోరుగా జరుగుతోంది.

ఈనెల 19న విడుదల కానున్న 'భగవంత్ కేసరి'..

ఇక 'భగవంత్ కేసరి' సినిమా విషయానికొస్తే బాలయ్య తెలంగాణ యాసలో నటించిన ఈ చిత్రం దసరా కానుకగా ఈనెల 19న విడుదల కానుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. సీనియర్ హీరోయిన్ కాజల్ బాలయ్యకు జోడిగా, యంగ్ హీరోయిన్ శ్రీలల ఆయనకు కూతురిగా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో ఊపు మీదున్న బాలయ్యకు ఈ సినిమా కూడా హ్యాట్రిక్ విజయం అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

More News

Bigg Boss 7 Telugu : అలసిపోయానన్న ప్రియాంక, బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా ప్రిన్స్ యావర్

బిగ్‌బాస్‌లో 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు హౌస్‌లో మంచి వినోదాన్ని అందిస్తున్నారు. పోటుగాళ్లుగా బిగ్‌బాస్ చేత అనిపించుకున్న వీళ్లు అలాగే దూసుకెళ్తున్నారు.

Let's Metro For CBN: 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో ఉద్రికత్త.. మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

IAS and IPS officers:కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జాబితా ఇదే..

తెలంగాణలో ఎన్నికల విధుల నుంచి కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే.

Gudivada Amarnath:చంద్రబాబుకు పంపే ఇంటి భోజనంపై అనుమానాలున్నాయి.: మంత్రి అమర్నాథ్

జైలులో ఉన్న చంద్రబాబుకు కుటుంబసభ్యులు పంపుతున్న భోజనంపై తమకు అనుమానం ఉందంటూ  ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vrushabha:మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో 'వృషభ'..  ముంబైలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'...