వెడ్డింగ్ కార్డు పై బాలయ్య ఫొటో.. ఫ్యాన్స్ ఫిదా!

  • IndiaGlitz, [Monday,May 06 2019]

అభిమానులు తాము ఇష్టపడే హీరో, నేతల కోసం ఏమైనా చేసేస్తుంటారు.! సినిమాలు రిలీజయినా, పుట్టిన రోజులు వేడుకలు, ఈవెంట్స్ ఇలాంటి సమయాల్లో అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సౌత్‌లో హీరోలకు ప్రాణాలిచ్చేసే ఫ్యాన్స్‌ ఉన్నారంటే అర్థం చేసుకోండి.! ఇక అభిమానులు పెళ్లిళ్లకు, ఇంట్లో జరిగే శుభకార్యాలయాలకు కార్డ్స్ కొట్టించి వాటిపై హీరోల ఫొటోలు ముద్రించి ఇలా కూడా అభిమానం చాటుకుంటూ ఉంటారు. ఇప్పటికే పెళ్లి కార్డుల్లో ప్రధాని మోదీ ఫొటో ముద్రించి పలువురు కార్యకర్తలు, అభిమానులు వినూత్నంగా చేసిన విషయాలు హైదరాబాద్ మొదలుకుని దేశ వ్యాప్తంగా జరిగినవే..

అభిమానులకు ఆహ్వానం..

తాజాగా టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కన్నడ అభిమాని.. తన అభిమానాన్ని ఎలా చాటుకున్నారో మీరే చూడండి. కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు తన కుమారుడి పెళ్లి పత్రికపై బాలయ్య ఫోటోలతో ముద్రించాడు. నందమూరి అభిమానులందరూ.. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానించాడు. మే-13 న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడిని మీ అమూల్యమైన ఆశీస్సులు అందించాలని వెడ్డింగ్‌కార్డ్‌లో కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.. మా ఆరాధ్య దైవం బాలయ్య బాబు అంటూ పత్రికపై ముద్రించాడు.

ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో.. కన్నడ అభిమాని పెళ్లికి ఎంతమంది హాజరవుతారో వేచి చూడాల్సిందే మరి. ఇది చూసిన నందమూరి అభిమానులు శ్రీనివాసులు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోతున్నారు. ఈ విషయం బాలయ్య దాకా చేరిందో లేదో.. ఒకవేళ బాలయ్యకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో!