సింగర్ గా మారుతున్న బాలయ్య హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సింగర్ గా మారుతున్న బాలయ్య హీరోయిన్ ఎవరో కాదు..ఆంధ్రాపోరి అంజలి. తన అందం, అభినయంతో ఆకట్టుకుని అనతికాలంలోనే ఇటు తెలుగు, అటు తమిళ్ లో మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. లేటెస్ట్ గా నందమూరి నట సింహం బాలయ్యతో డిక్టేటర్ మూవీలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంజలి ప్రస్తుతం తమిళ్ లో యార్ నీ చిత్రంలో నటిస్తుంది.
ఈ చిత్రం కోసం అంజలి సింగర్ గా మారి ఓ పాట పాడిందట. అలాగే ఈ చిత్రం తెలుగు వెర్షన్ చిత్రాంగద లో కూడా అంజలి పాట పాడుతుండడం విశేషం. హార్రర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అధిక భాగం షూటింగ్ అమెరికాలోనే జరుగుతుంది. తమిళ్ లో సక్సెస్ కోసం యార్ నీ మూవీ పై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ..సింగర్ గా కూడా మారిన అంజలిని విజయం వరిస్తుందో లేదో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com