Bhagwant Kesari:బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'..
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చూపేందుకు వచ్చేసింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే మూవీని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటించగా, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ఇక శరత్‌కుమార్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించగా.. థమన్ సంగీతం అందించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో దసరా విన్నర్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.140కోట్లు వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో హ్యాట్రిక్ సినిమాలతో రూ.100కోట్లు సాధించిన సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1980 బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుందని సమాచారం. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com