బాలయ్య వందో సినిమా ఇదే...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటించిన 99వ సినిమా డిక్టేటర్. శ్రీవాస్ తెరకెక్కించిన డిక్టేటర్ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య నటించే వందో సినిమాకి...బోయపాటి శ్రీను డైరెక్టర్ అంటూ ప్రచారం జరిగింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్... స్పీడున్నోడు సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్నానని...ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రారంభం అవుతుందని ప్రకటించారు. బోయపాటి సరైనోడు సినిమా తర్వాత బాలయ్య వందో సినిమా చేస్తారనుకున్నారు. కానీ...బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. దీనిని బట్టి బాలయ్య వందో సినిమాకి డైరెక్టర్ బోయపాటి కాదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే...
బాలయ్య వందో సినిమా బాధ్యతను సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు అప్పగించారని ప్రచారం జరుగుతుంది. సింగీతం శ్రీనివాసరావు బాలయ్య తో ఆదిత్య 369, భైరవద్వీపం...చిత్రాలు తెరకెక్కించారు. ఆయనకి ఎప్పటి నుంచో ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ ఆదిత్య 999 తీయాలని ఉంది. ఈ విషయాన్ని బాలయ్యకి సింగీతం చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ భారీ క్రేజీ మూవీని బాలయ్య పుట్టినరోజైన జూన్ 10 ఎనౌన్స్ చేస్తారట. మరి...ఇది నిజమో..కాదో..తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com