అనూహ్య నిర్ణయం తీసుకున్న బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి
Send us your feedback to audioarticles@vaarta.com
గణేష్ చతుర్ధి అంటే తెలుగు రాష్ట్రాల్లో హైద్రాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటారు. లడ్డు వేలం విషయానికి వస్తే మాత్రం బాలాపూర్‌ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ సారి బాలాపూర్ లడ్డూ విషయంలో గణేష్ ఉత్సవ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వినాయక చతుర్థి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే లడ్డూ వేలంను నిర్వహించకూడదని కమిటీ నిర్ణయించింది. ఈ సారి బాలాపూర్ వినాయకుని లడ్డూని కేసీఆర్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
బాలాపూర్ కమిటి వేలం 1994లో ప్రారంభమైంది. తొలుత వందల రూపాయలు మాత్రమే పలికిన బాలాపూర్ లడ్డూ.. ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నవారికి ఆ ఏడాదంతా బాగా కలిసివస్తుందని నమ్ముతారు. కాగా బాలాపూర్ లడ్డూను ఎక్కువగా కొలను కుటుంబీకులు దక్కించుకున్నారు. ఇప్పటికి 9 సార్లు ఈ కుటుంబీకులు లడ్డూను దక్కించుకోవడం విశేషం. 1994లో సైతం తొలి లడ్డూను ఈ కుటుంబానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి 450 రూపాయలకు దక్కించుకున్నారు.
అనంతరం 1995లో కూడా కొలను మోహన్‌రెడ్డే లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఈ సారి లడ్డూ ధర రూ.4500 పలికింది. అప్పటి నుంచి 1997 వరకూ ఈ కుటుంబమే బాలాపూర్ లడ్డూను దక్కించుకుంది. 2005లో తొలిసారి బాలాపూర్ లడ్డూ 1.05 లక్షలు పలికింది. 2014లో పది లక్షల రూపాయలకు పైగా బాలాపూర్ లడ్డూ వసూలు చేసింది. కాగా 2019లో కూడా లడ్డూను కొలను కుటుంబీకులే దక్కించుకున్నారు. 2019లో బాలాపూర్ లడ్డూ రూ.17.50 లక్షలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు. ఈ ఏడాది మాత్రం లడ్డూను సీఎం కేసీఆర్‌కు అందించాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com