అనూహ్య నిర్ణయం తీసుకున్న బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

గణేష్ చతుర్ధి అంటే తెలుగు రాష్ట్రాల్లో హైద్రాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటారు. లడ్డు వేలం విషయానికి వస్తే మాత్రం బాలాపూర్‌ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ సారి బాలాపూర్ లడ్డూ విషయంలో గణేష్ ఉత్సవ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వినాయక చతుర్థి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్‌గా జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే లడ్డూ వేలంను నిర్వహించకూడదని కమిటీ నిర్ణయించింది. ఈ సారి బాలాపూర్ వినాయకుని లడ్డూని కేసీఆర్‌కు అందజేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

బాలాపూర్ కమిటి వేలం 1994లో ప్రారంభమైంది. తొలుత వందల రూపాయలు మాత్రమే పలికిన బాలాపూర్ లడ్డూ.. ప్రస్తుతం లక్షలకు చేరుకుంది. ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడతారు. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నవారికి ఆ ఏడాదంతా బాగా కలిసివస్తుందని నమ్ముతారు. కాగా బాలాపూర్ లడ్డూను ఎక్కువగా కొలను కుటుంబీకులు దక్కించుకున్నారు. ఇప్పటికి 9 సార్లు ఈ కుటుంబీకులు లడ్డూను దక్కించుకోవడం విశేషం. 1994లో సైతం తొలి లడ్డూను ఈ కుటుంబానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి 450 రూపాయలకు దక్కించుకున్నారు.

అనంతరం 1995లో కూడా కొలను మోహన్‌రెడ్డే లడ్డూను దక్కించుకున్నారు. కాగా ఈ సారి లడ్డూ ధర రూ.4500 పలికింది. అప్పటి నుంచి 1997 వరకూ ఈ కుటుంబమే బాలాపూర్ లడ్డూను దక్కించుకుంది. 2005లో తొలిసారి బాలాపూర్ లడ్డూ 1.05 లక్షలు పలికింది. 2014లో పది లక్షల రూపాయలకు పైగా బాలాపూర్ లడ్డూ వసూలు చేసింది. కాగా 2019లో కూడా లడ్డూను కొలను కుటుంబీకులే దక్కించుకున్నారు. 2019లో బాలాపూర్ లడ్డూ రూ.17.50 లక్షలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు. ఈ ఏడాది మాత్రం లడ్డూను సీఎం కేసీఆర్‌కు అందించాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటి నిర్ణయించింది.

More News

ఓ సోష‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను కోల్పోతున్నాం: మోహనకృష్ణ ఇంద్రగంటి

గ్రహణం సినిమాతో దర్శకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి తన కెరీర్‌ను ప్రారంభించారు.

తెలంగాణలో కొత్తగా 2734 కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

‘ఆచార్య’ రిలీజ్ డేట్ అప్పుడేనా?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది.

హోస్టన్‌లో పవన్ బర్త్‌డే‌ను గ్రాండ్‌గా నిర్వహించిన అభిమానులు

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా హెల్త్ అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.