యూత్ ఫుల్ గా 'బలపం పట్టి భామ ఒడిలో'
Sunday, August 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రష్మీగౌతమ్, శాంతన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో `బలపం పట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాదమైంది. `అ ఆ ఇ ఈ` అనేది ఉపశీర్షిక. దుర్గం గిరీష్ బాబు సమర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ గజగౌని నిర్మాత. ఎ.సి.ముగిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ``కథ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువతకు నచ్చేలా భారతీబాబు మంచి డైలాగులు రాశారు. రష్మీ గౌతమ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. అనువాద పనులు పూర్తయ్యాయి. విజయ్ ఎబింజర్ సంగీతం ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఎబింజర్, రచన: భారతీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కరణ మల్తుమ్‌కర్, సహ నిర్మాత: కె.మాధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.నాగరాజ్ గైడ్, రమేష్ కైగూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments