Balakrishna: 'హనుమాన్' సినిమాను చూసిన బాలకృష్ణ.. మూవీ యూనిట్‌పై ప్రశంసలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన 'హనుమాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆంజనేయస్వామిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ జై హనుమాన్ అంటున్నారు. మూవీలోని వీఎఫ్క్స్, గ్రాఫిక్స్‌కు సలాం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే రూ.100కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ చిత్రం రూ.200కోట్ల క్లబ్ వైపు పరిగెడుతోంది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ మూవీని కుటుంబసభ్యులతో కలిసి వీక్షించారు.
మూవీ చూసిన అనంతరం సినిమా కన్నువల పండుగలా ఉందని కొనియాడారు. మూవీలోని ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ప్రాణం పెట్టి చేసినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుందని పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే 'హనుమాన్ 2' కోసం వెయిట్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య మూవీ తీయబోతున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాలయ్య.. హనుమాన్ మూవీ చూసి ప్రశాంత్‌ను అభినందించడంతో వీరి కాంబోలో మూవీ కన్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్, రిషబ్ శెట్టి కూడా హనుమాన్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా సూపర్బ్‌గా ఉందని.. ప్రశాంత్ వర్మ దర్శకత్వం మైండ్ బ్లోయింగ్ అని శివన్న కితాబు ఇచ్చారు. తేజ, వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా నటించారన్నారు. చివరి అరగంట గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు ప్రశాంత్ టేకింగ్, నిర్మాణ విలువలు, తేజ సజ్జ యాక్టింగ్ బాగున్నాయని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్ సమంత కూడా మూవీ యూనిట్‌పై ప్రశంసలు కురిపించింది. చిత్ర బృందం అద్భుతమైన విజయాన్ని అందుకుందన్నారు. మొత్తానికి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన 'హనుమాన్' మూవీ ఇటు భారత్‌తో పాటు ఓవర్సీస్లోనూ దుమ్మురేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments