Download App

Balakrishnudu Review

బాణం చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన నారా రోహిత్ త‌ర్వాత సోలో, అసుర‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో ఒక‌టుండేవాడు వంటి విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌టించి మెప్పించాడు. ఈ యువ హీరో తొలిసారిగా చేసిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా `బాల‌కృష్ణుడు`. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించ‌డం నారా రోహిత్‌కు ఇదే ప్ర‌థ‌మం. మ‌రి బాల‌కృష్ణుడు నారా రోహిత్ ఏమైనా మాయ చేశాడా? క‌మ‌ర్షియ‌ల్ హీరోగా రోహిత్ న‌ట‌న తెర‌పై ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు కథ‌లోకి ఓ లుక్కేద్దాం.

క‌థ:

సినిమా క‌ర్నూలు జిల్లాలో ప్రారంభం అవుతుంది. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌నుకునే మ‌నుషులు ర‌వీంద‌ర్ రెడ్డి(ఆదిత్య మీన‌న్‌), ఆయ‌న చెల్లెలు భానుమ‌తి(ర‌మ్య‌కృష్ణ‌). వీరిద్దరికీ విరోధులు బ‌సిరెడ్డి(రామ‌రాజు) అత‌ని కొడుకు ప్ర‌తాప్ రెడ్డి(అజ‌య్‌). ర‌వీంద‌ర్ రెడ్డి కార‌ణంగా అవ‌మానానికి గురైన బ‌సిరెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణిస్తాడు. దాంతో ప్ర‌తాప్ రెడ్డి ప‌గ‌బ‌ట్టి ర‌వీంద‌ర్ రెడ్డిని చంపేస్తాడు. చుట్టు ప‌క్క‌ల ఉన్న 40 ఊర్ల‌కు భానుమ‌తి పెద్ద దిక్కు అవుతుంది. ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌కు దూరంగా త‌న మేన‌కోడ‌లు ఆద్య‌(రెజీనా)ను హైద‌రాబాద్‌లో ఉంచి చ‌దివిస్తుంటుంది. ప్ర‌తాప రెడ్డి, అత‌ని మ‌నుషుల నుండి త‌న మేన‌కోడ‌లు ఆద్యను కాపాడుకోవ‌డానికి బాలు(నారారోహిత్‌)ను నియ‌మి్తారు. నారా రోహిత్‌, ఆద్య‌తో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌తారు అనుకోని పరిస్థితుల్లో బాలు, ఆద్య హైద‌రాబాద్ నుండి కర్నూలు తీసుకురావాల్సి వస్తుంది. ఆ విష‌యం తెలుసుకున్న ప్ర‌తాప్ రెడ్డి ఏం చేస్తాడు?  బాలు, ఆద్య ఒక‌ట‌వుతారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

-  క‌మ‌ర్షియ‌ల్ హంగులు
- పృథ్వీ కామెడీ
- నిర్మాణ విలువ‌లు
- సినిమాటోగ్ర‌ఫీ
- సంగీతం

మైన‌స్ పాయింట్స్:

- రొటీన్ క‌థ‌
- అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు, పాత్ర‌లు

స‌మీక్ష:

న‌టీన‌టుల పరంగా చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌ని రోహిత్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశాడు. అందుకోసం స‌న్న‌గా త‌యారైయ్యాడు.డ్యాన్సులు, ఫైట్స్‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక హీరోయిన్ ఇక రెజీనా లుక్ ప‌రంగా అందంగా క‌నిపించింది. ఇక అందాల ఆర‌బోత‌లో కూడా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. భానుమ‌తి పాత్ర‌లో చేసిన ర‌మ్య‌కృష్ణ గంభీర‌మైన పాత్ర‌లో చ‌క్క‌గా చేసింది. శివ‌గామి వంటి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌కు ఈరోల్ చేయ‌డం పెద్ద క‌ష్టంగా అనిపించ‌దు. ఇక సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్ పృథ్వీ కామెడీ. ఫోటోగ్రాఫ‌ర్ మ్యాడీగా త‌నదైన బాడీ లాంగ్వేజ్‌, పంచ్ డైలాగ్‌ల‌తో పృథ్వీ ఆసాంతం ఆడియెన్స్‌ను న‌వ్వించాడు. అజ‌య్ కూడా పూర్తిస్థాయి విల‌న్ పాత్ర‌లో మెప్పించాడు. ఇక శ్రీనివాస‌రెడ్డి, ఆదిత్య మీన‌న్‌, ర‌ఘుబాబు, ర‌వివ‌ర్మ, వెన్నెల‌కిషోర్‌, సత్య‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. ద‌ర్శ‌కుడు  వెన్నెల‌కిషోర్ పాత క‌థ‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ఆట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ముఖ్యంగా కామెడీ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా ప్రెజెంట్ చేశారు. మ‌ణిశ‌ర్మ సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. విజ‌య్ సి.కుమార్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రొటీన్ క‌థ‌, క‌థ‌నం, కొత్త‌ద‌నం ఉండ‌దు. సినిమాను ఎంజాయ్ చేయాల‌నుకునే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌స్తారు. ముఖ్యంగా రోహిత్‌, పృథ్వీ మ‌ధ్య కామెడీ స‌న్నివేశాలు ఆడియెన్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. అలాగే నాట‌కం బ్యాచ్‌గా శ్రీనివాస‌రెడ్డి తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం, ఆ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన తీరు బావున్నాయి.

బాట‌మ్ లైన్: న‌వ్వించే 'బాల‌కృష్ణుడు'

Balakrishnudu Movie Review in English

Rating : 3.0 / 5.0