ఆక్టటుకుంటోన్న బాలకృష్ణ సరికొత్త లుక్
- IndiaGlitz, [Monday,January 20 2020]
నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106వ చిత్రమిదే. యన్.టి.ఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేదు. ఈ సినిమా విషయంలో బాలకృష్ణ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఏమాత్రం తొందరపడటం లేదు. స్క్రిప్ట్ విషయంలో బోయపాటిని కేర్ తీసుకోమని బాలయ్య ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళుతుందని అనుకుంటున్న ఈ సినిమా ఆలస్యమవుతుంది. తాజాగా.. బాలకృష్ణ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గుండు కొట్టుకుని ఉన్న బాలయ్య వైట్ అండ్ వైట్‌లో కననపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బాలయ్య సందడి చేస్తూ కనిపించారు. మరి ఈ లుక్ సినిమా కోసమా? లేక వ్యక్తిగతంగానా? అని మాత్రం తెలియడం లేదు. ఈ సినిమా కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు. మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే బి.గోపాల్ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయడానికి బాలకృష్ణ సన్నాహాలు చేసుకుంటున్నారని మరో వైపు వార్తలు వినపడుతున్నాయి.