ఆక్ట‌టుకుంటోన్న బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌

  • IndiaGlitz, [Monday,January 20 2020]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106వ చిత్ర‌మిదే. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, రూల‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేదు. ఈ సినిమా విష‌యంలో బాల‌కృష్ణ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఏమాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేదు. స్క్రిప్ట్ విష‌యంలో బోయ‌పాటిని కేర్ తీసుకోమ‌ని బాల‌య్య ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళుతుంద‌ని అనుకుంటున్న ఈ సినిమా ఆల‌స్య‌మ‌వుతుంది. తాజాగా.. బాలకృష్ణ కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

గుండు కొట్టుకుని ఉన్న బాల‌య్య వైట్ అండ్ వైట్‌లో క‌న‌న‌ప‌డుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లోనూ బాల‌య్య సంద‌డి చేస్తూ క‌నిపించారు. మ‌రి ఈ లుక్ సినిమా కోసమా? లేక వ్య‌క్తిగ‌తంగానా? అని మాత్రం తెలియ‌డం లేదు. ఈ సినిమా కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. మిర్యాల ర‌వీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌కుండానే బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలోనూ మ‌రో సినిమా చేయ‌డానికి బాల‌కృష్ణ స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని మ‌రో వైపు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

కేరళలో 'విరాటపర్వం' షూటింగ్‌ లో రానా

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఆమెను మ‌రోసారి విల‌క్ష‌ణ పాత్ర‌లో ప్రెజెంట్ చేయ‌నున్న సుకుమార్‌

`రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్ మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూస్తున్నాడు.

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతూ వ‌చ్చిన డ‌స్కీ బ్యూటీ ఈషారెబ్బాకు పెద్ద అవ‌కాశ‌మే ద‌క్కింది.

`RRR` విడుద‌ల తేదీపై రాజ‌మౌళి తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

గోవాలో సొంతిల్లు.. సమంత కోరిక ఇదేనట!

సొంతిల్లు అంటే ఎవరికైనా మక్కువే. జీవితకాలంలో తనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఎవరైనా భావిస్తుంటారు.