నందమూరి బాలకృష్ణ 'నర్తనశాల' ఈ నెల 24న విడుదల

  • IndiaGlitz, [Monday,October 19 2020]

సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఒక శుభవార్త.

More News

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..

కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

'క‌ల‌ర్ ఫొటో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

టీడీపీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు.. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్న..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కమిటీలను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించిన చంద్రబాబు..

డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగిపోయింది.

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఐదేళ్ల క్రితం పిన తల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురై..