బాలయ్య ఖాతాలో మరో రూ.100కోట్లు సినిమా.. దసరా విన్నర్‌గా 'భగవంత్ కేసరి'
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది దసరా విన్నర్‌గా నిలిచారు. ఆయన నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.30 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంది. రెండో రోజు నుండి కలెక్షన్స్ మరింత పెరిగి రూ.100 కోట్లు రాబట్టింది.
సీనియర్ హీరోల్లో ఏకైక హీరో బాలయ్య..
మంగళవారం నాటికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్లో కూడా వన్ మిలియన్ మార్క్ రాబట్టినట్లు పేర్కొంది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' తర్వాత బాలయ్య ఖాతాలో మరో రూ.100 కోట్ల మూవీగా 'భగవంత్ కేసరి' నిలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తర్వాత వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా బాలయ్య నిలిచారు. ఇక సీనియర్ హీరోల్లో ఈ మార్క్ అందుకున్న ఏకైక హీరో కూడా బాలకృష్ణ కావడం విశేషం.
లాంగ్ రన్లో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం..
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా, శ్రీ లీల కూతురి పాత్రలో కనిపించింది. మూవీలో బాలయ్య మార్క్ యాక్షన్‌తో పాటు ఆడపిల్లలకు సమస్య వస్తే ఎదిరించి ఎలా నిలబడాలి అనే మెసేజ్‌ని ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండడంతో ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. లాంగ్ రన్లో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments