బాల‌య్య 106 ప్లాన్ అదేనా?

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ముందుగా జూలై చివ‌ర‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమాను జూలై 30న విడుద‌ల చేసే అవ‌కాశం లేదు. దీంతో సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ క‌రోనా క్వారంటైన్ టైమ్‌లో సినిమా స్క్రిప్ట్‌కు మ‌రింత‌గా మెరుగులు దిద్దుతున్నాడ‌ట బోయపాటి. ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడ‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.