రేసుగుర్రం బ్యూటీతో బాలయ్య...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిజాన్ని డిపరెంట్‌గా తెరకెక్కించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశరన్, ముస్కాన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం బాలయ్య, పూరి సహా యూనిట్ అంతా పోర్చుగల్‌లో చిత్రీకరణలో బిజీగాఉ న్నారు. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. అల్రెడి ఇద్దరు ముద్దు గుమ్మలున్న ఈ సినిమాలో మరో హాట్ హీరోయిన్ బాలయ్యతో చిందేయనుంది. సురేందర్ రెడ్డి రేసుగుర్రంలో బూచాడే బూచాడే..సాంగ్‌లో నర్తించిన కైరా దత్‌ను పూరి తన చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించి ఓకే చేసుకున్నారట. బాలయ్య గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com