బోయపాటి టైటిల్‌తో బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 105వ సినిమాకు సంబంధించిన వేగంగా జరుగుతున్నాయి. జైసింహా తర్వాత కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మాత. ఈ నెలలో లాంఛనంగా మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్‌లోనే జరుగుతుంది. ఇందులో బాలకృష్ణతో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు.
పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య నటించబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ పెట్టబోతున్నారని అంటున్నారు. నిజానికి ఈ టైటిల్‌ను బోయపాటి శ్రీను, తన దర్శకత్వంలో బాలకృష్ణ కోసం అనుకున్నాడు. కానీ తీరా ఇప్పుడు బాలకృష్ణ 105వ సినిమా కోసం సి.కల్యాణ్ అడగ్గానే ఇచ్చేశాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments