బ‌న్నీ టైటిల్‌తో బాల‌య్య‌

  • IndiaGlitz, [Wednesday,December 18 2019]

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తొలి రెండు చిత్రాల త‌ర‌హాలో ఏక ప‌దాన్నే టైటిల్‌గా పెట్టాల‌ని బోయపాటి భావిస్తున్నాడ‌ట‌.

ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు ప్ర‌కారం ఈ సినిమాకు బోయ‌పాటి ఐకాన్ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. అయితే ఈ టైటిల్‌తో అల్లు అర్జున్‌, దిల్‌రాజు, వేణు శ్రీరామ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ట్రాక్ ఎక్క‌డానికి స‌మ‌యం ఉంద‌ని, లేదు ఆగిపోయింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిర్మాత దిల్‌రాజును బోయపాటి టైటిల్ కోసం సంప్ర‌దించాడ‌ని టాక్‌.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'రూల‌ర్' సినిమా రూపొంద‌నుంది. జైసింహా త‌ర్వాత బాల‌య్య‌, క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల కానుంది. వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.