శ్యామ్ సింగరాయ్‌ని వీక్షించిన బాలయ్య.. బాగా తీశారంటూ కితాబు
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా.. ఆయన సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్‌లుగా నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న విడుదలైంది. మంచి మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. నాని కెరీర్‌లోనే తొలిసారిగా దక్షిణాది భాషలన్నింటిలో శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అయ్యింది.
కాగా ఈ చిత్రాన్ని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోసం నేడు ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమా వీక్షించారు బాలయ్య. బాగా చేశారంటూ హీరో నానితో పాటు చిత్రంలోని నటీనటులను, టెక్నీషియన్లను ఆయన అభినందించారు. అలాగే సినిమా బాగా తీశావంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌ను బాలయ్య ప్రశంసించారు.
ఇక నిన్న అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమాను కూడా బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ .. బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ని వేయించారు. బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి, బీజేపీ నేత పురందేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్‌లు పుష్ప సినిమాను వీక్షించారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ‘‘ఆహా’’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో లో ఇటీవల ‘‘పుష్ప’’ టీమ్ తో బాలయ్య హంగామా చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments