బాలకృష్ణకి ఆ పాత్రలో నటించాలనుందంట
Send us your feedback to audioarticles@vaarta.com
'జై సింహా' సినిమాతో మరోసారి 'సంక్రాంతి కథానాయకుడు' అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం కోసం.. బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పిన బాలయ్యను బ్రాహ్మణ సంఘాలు అభినందిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో జరిగిన చిత్ర విజయోత్సవ సభ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.
మన దేశంలోగల అన్ని మతాల గ్రంథాల్లోని సారాన్ని తెలుసుకుని జీవితం సాగిస్తూ ఉంటాను. నేను వైవిధ్యమైన పాత్రలను చేసిన ప్రతీసారి నన్ను ఆదరించారు" అని తెలిపారు. అలాగే...“నా అరవయ్యో యేట రామానుజాచార్యగా నటిస్తాను. రామానుజాచార్యులు అంతా సమానమే అని చెబుతూ.. చాపకూటి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అష్టాక్షరి మంత్రాన్ని కూడా రాసి ప్రచారం చేశారు.
నాకు రామానుజాచార్యుల పాత్రలో నటించాలని ఉంది" అని తన కోరికను వెల్లడించారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ వయసు 57 సంవత్సరాలు.. ఆ లెక్కన ఈ సినిమా పట్టాలెక్కడానికి మరో మూడేళ్ళ సమయం పట్టనుందన్న మాట. ఇదిలా వుంటే...ప్రస్తుతం మహానటుడు యన్.టి.ఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న'యన్.టి.ఆర్' సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com