బాల‌య్య‌, వినాయ‌క్ సినిమా ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Monday,March 26 2018]

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘జై సింహా’తో మంచి విజయాన్ని అందుకున్నారు నిర్మాత సి.కళ్యాణ్. నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా నిర్మాతకు లాభాలను మిగిల్చింది. దీని తర్వాత ‘ఇంటిలిజెంట్’ చిత్రాన్ని నిర్మించారు కళ్యాణ్. క‌థానాయ‌కుడు సాయిధరమ్‌ తేజ్, ద‌ర్శ‌కుడు వి.వి.వినాయక్ జట్టు క‌ట్టిన‌ ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ నష్టాలను పూడ్చే దిశగా.. బాలయ్య మరో సినిమా చేస్తానని కళ్యాణ్‌కు మాటిచ్చారు. ఈ క్రమంలోనే.. తాజాగా బాలకృష్ణ మరో సినిమా చేయడానికి సిద్ధపడ్డారు.

‘ఇంటిలిజెంట్’ లాంటి డిజాస్ట‌ర్‌ను తెర‌కెక్కించిన‌ వినాయక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 27న చిత్రాన్ని లాంచ్ చేసి షూటింగ్ కూడా అప్పుడే ప్రారంభించే దిశగా దర్శకుడు ఆలోచిస్తున్నారు. చిత్రీకరణను అతి త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి. గతంలో బాలయ్య, వినాయక్ కలయికలో ‘చెన్నకేశవరెడ్డి’ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఈ కాంబోలో సినిమా రాబోతుండ‌డంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.