బాబాయ్ బాలయ్య తో పోటీకి రెఢీ అంటున్న అబ్బాయ్ ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.ఈనెల 20న ఆడియోను, సంక్రాంతికి కానుకగా జనవరి 14న డిక్టేటర్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...నందమూరి హీరో ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.
స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న నాన్నకు ప్రేమతో...చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఎనౌన్స్ చేసారు. ఒక రోజు గ్యాప్ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం, అదీ..నందమూరి హీరోల సినిమాలు కావడం విశేషం. మరి...బాబాయ్ బాలయ్యతో పోటీకి రెఢీ అని అబ్బాయ్ ఎన్టీఆర్ అనడంతో సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ వేడెక్కుతుంది. మరి..ఈ.. నందమూరి హీరోల పోటీలో బాబాయ్ బాలయ్య గెలుస్తాడా..? అబ్బాయ్ ఎన్టీఆర్ గెలుస్లాడా తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com